ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన DA(Dearness Allowance) ఉత్తర్వులు విడుదలయ్యాయి. 3.64 శాతం పెంచుతూ రాష్ట్ర కేబినెట్ మొన్న నిర్ణయం తీసుకోగా.. అందుకు సంబంధించిన ఆర్డర్స్ వచ్చేశాయి. పెరిగిన DA 2022 జులై 1 నుంచి వర్తించనుంది. ఈ పెంపుతో 22.75 శాతం ఉన్న DA 26.39 శాతం కానుంది. డిసెంబరు 1న చెల్లించే నవంబరు జీతంతో కలిపి పెరిగిన అలవెన్స్ చెల్లించనుండగా.. 2022 జులై 1 నుంచి ఈ నెల వరకు ఇవ్వాల్సిన బకాయిల్ని GPF ఖాతాలో జమ చేయనున్నట్లు సర్కారు తెలిపింది.