కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా గ్రామాలు వరదనీటి(Floods)లో చిక్కుకున్నాయి. రోడ్డు, రైలు మార్గాలు తెగిపోగా.. 99 రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. దీనిపై CM అత్యవసర రివ్యూ నిర్వహించగా.. కేంద్ర మంత్రి బండి సంజయ్ అమిత్ షాతో మాట్లాడటంతో 9 NDRF బృందాల్ని రాష్ట్రానికి పంపించారు.
వరదల ధాటికి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. రేపటివరకు రెడ్ అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితుల్లో ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. విశాఖపట్నం, చెన్నై, అస్సాం నుంచి మూడేసి చొప్పున 9 NDRF టీంలు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా.. పలు వర్సిటీలు పరీక్షల్ని వాయిదా వేశాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.