వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు విదేశీ విద్య అందించాలన్న లక్ష్యంలో భాగంగా ప్రవేశపెట్టిన ‘మహాత్మా జ్యోతిబాపూలే BC ఓవర్సీస్ విద్యా నిధి’ పథకానికి అప్లికేషన్లు స్టార్ట్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ స్కీమ్ లో భాగంగా పేద కుటుంబాలకు చెందిన స్టూడెంట్స్ నుంచి అప్లికేషన్లు కోరుతోంది. 2023 ఏడాదికి గాను సెప్టెంబరు 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా.. తుది గడువును సెప్టెంబరు 30 వరకు ఇచ్చింది. BC, OBC కులాలకు చెందిన విద్యార్థులు ఈ స్కీమ్ కు ఎలిజిబిల్ అని BC సంక్షేమ శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం తెలిపారు.
2023 జులై 1 నాటికి 35 ఏళ్లు దాటని విద్యార్థులు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. కుటుంబ ఆదాయం సంవత్సరానికి గరిష్ఠంగా రూ.5 లక్షల లోపు ఉండాలి. గ్రాడ్యుయేషన్ లో 60% మార్కులు స్కోరయి ఉండాలని, రూల్స్ ప్రకారం అవసరమైన సర్టిఫికెట్లు, వీసా తదితర డాక్యుమెంట్స్ సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు http://www.telanganaepass.cgg.gov.inను సంప్రదించాలన్నారు.