ఇప్పటివరకు నిరసనలు, ఆందోళనలు కొనసాగించిన గ్రూప్-2 అభ్యర్థులు.. ఇక న్యాయపోరాటం చేస్తున్నారు. ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-2 ఎగ్జామ్స్(Exams)ను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించే పరీక్షల్ని వాయిదా వేయాలంటూ పిటిషన్ లో అభ్యర్థించారు. ఇప్పటికే నాంపల్లిలోని TSPSC ఆఫీసు ముందు ధర్నా చేస్తున్న అభ్యర్థుల్లో కొందరు.. హైకోర్టుకు వెళ్లారు. 150 మంది క్యాండిడేట్స్ కలిసి ఈ పిటిషన్ వేశారు.
అటు గురుకుల పరీక్షలు, ఇటు JL, మరోవైపు గ్రూప్-2 ఇలా రకరకాల ఎగ్జామ్స్ ను ఏకకాలంలో ఎలా రాసేదంటూ ఆవేదన చెందుతున్నారు. అందుకే గ్రూప్-2ని రీషెడ్యూల్ చేసేలా సర్కారును ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.