గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్(Revaluation) జరిపించాలంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పేపర్ల మూల్యాంకనం ఇష్టమొచ్చినట్లు జరిగిందని, 18 రకాల సబ్జెక్టులుంటే 12 రకాల సబ్జెక్టు నిపుణులతోనే దిద్దించారని కోర్టుకు తెలిపారు. 3 భాషల్లో పరీక్షలు జరిగినా ఎక్స్ పర్ట్స్ తో దిద్దించలేదని, ఒకే రకమైన నిపుణులతో తెలుగు, ఇంగ్లిష్ మీడియం పేపర్లు దిద్దించారని విన్నవించారు. ఇలా రెండు భాషల పేపర్లు ఒకే మీడియం నిపుణుడితో దిద్దించడంతో లోపభూయిష్ఠంగా మారిందని వాదనలు వినిపించారు. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వివరించారు. దీనిపై TGPSCకి నోటీసులు జారీచేసిన న్యాయస్థానం.. నాలుగు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.