Published 19 Dec 2023
భారీ వ్యయంతో నిర్మితమైన మేడిగడ్డ(లక్ష్మీ బ్యారేజీ) ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ(CBI Enquiry) తప్పదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అంశాన్ని అధికార హస్తం పార్టీ సీరియస్ గా తీసుకోవడంతో విచారణ ఛాయలు కనపడుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాలంటే CBI విచారణకు ఆదేశించాలంటూ కాంగ్రెస్ నేత నిరంజన్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. వివరాలు సమర్పించాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA)కి పలు సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో సదరు సంస్థ.. చీఫ్ సెక్రటరీ(CS) శాంతికుమారికి లేఖ రాసింది. CS నుంచి సమాచారం తీసుకుని వివరాలు సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
రెండు వారాలకు వాయిదా
ఈ సమాచారం రెండు వారాల్లో తమకు అందజేయాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని ఆదేశిస్తూ విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను సర్కారు మూడేళ్లలో పూర్తి చేసింది. తెలంగాణ-మహారాష్ట్రను కలిపే ఈ బ్యారేజ్ వంతెన ఉన్నట్టుండి కుంగిపోయింది. అక్టోబరు 22న పెద్ద సౌండ్ తో పిల్లర్ దెబ్బతినడంతో 7వ బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో ఇంజినీర్లు హుటాహుటిన బ్యారేజీలోని 10 TMCల నీటిని విడుదల చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ పెద్దయెత్తున ఆరోపణలు చేసింది. లక్షా 50 వేల కోట్లు వెచ్చించిన ప్రాజెక్టు అతి కొద్దికాలంలోనే ప్రమాదానికి గురవడం గత ప్రభుత్వ తప్పిదమేనని మండిపడింది.
అద్భుతమైన వార్తలను అందిస్తున్న జస్ట్ పోస్ట్ న్యూస్ కు మా కృతజ్ఞతల..
మంచి వార్తలను అందిస్తున్న జస్ట్ పోస్ట్ న్యూస్ కు మా కృతజ్ఞతలు…