
MLA గాదరి కిశోర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన మధ్యంతర పిటిషన్ ను తోసిపుచ్చుతూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, వీవీప్యాట్ లు లెక్కించాలంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వేసిన పిటిషన్ ను తిరస్కరించాలంటూ వేసిన పిటిషన్ ను హైకోర్టు రిజెక్ట్ చేసింది. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఈ మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు అందుకు నిరాకరించింది.
ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ప్రత్యర్థిగా పోటీ చేసిన అద్దంకి దయాకర్.. 2019లో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ నిరాధారమని దాన్ని కొట్టివేయాలంటూ కిషోర్ కోరగా.. కోర్టు సమ్మతించలేదు. ఆ అభ్యర్థనను తోసిపుచ్చుతూ విచారణను సెప్టెంబరు 4కు వాయిదా వేసింది.