
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోడు రైతులకు ఎట్టకేలకు పట్టాలు అందుతున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్… వాటిని అర్హులైన వారికి అందజేస్తారు. పోడు సాగుదారుల నుంచి అప్లికేషన్లు తీసుకున్న సర్కారు, వాటిని గ్రామ, మండల, జిల్లా లెవెల్లో స్క్రూటినీ చేసిన తర్వాత అసలైన లబ్ధిదారులను తేల్చింది. ఇవాళ కేసీఆర్ ఆసిఫాబాద్ లో పర్యటిస్తుండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పోడు భూముల పట్టాలతోపాటు న్యూ కలెక్టరేట్ బిల్డింగ్, డిస్ట్రిక్ట్ పోలీసు ఆఫీసు, BRS పార్టీ ఆఫీసుల్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 4,06,369 ఎకరాలకు పోడు పట్టాలు రెడీ కాగా… 1,51,146 మంది రైతులు వాటిని అందుకోనున్నారు. కుమురం భీం జిల్లాలో 15,519 మంది రైతులకు 47,138 ఎకరాలుకు సంబంధించిన పట్టాలు పంపిణీ అవుతాయి.