భారీస్థాయిలో పోలీసు ఇన్స్ పెక్టర్ల(Inspectors)ను బదిలీ(Transfer) చేస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా పెద్దయెత్తున 53 మందికి స్థాన చలనం కల్పించారు. బదిలీ అయిన స్థానాల్లోకి అధికారులు వెంటనే జాయిన్ కావాలంటూ ఉత్తర్వుల్లో తెలియజేశారు. మీసాల అప్పలనాయుడును CCS నుంచి సెక్రటేరియట్ SHOగా.. చిలకలగూడ SHO సరికొండ మట్టంరాజును సైబర్ క్రైమ్ కు అటాచ్డ్ చేశారు.
మధురానగర్ SHO బూరుగు శ్రీనివాస్ ను మాదన్నపేట SHOగా… వీఆర్ లో ఉన్న షిగా సైదులును మధురానగర్ SHOగా… ఐఎస్ సదన్ SHO సన్నాల మల్లేశ్ ను టాస్క్ ఫోర్స్ అటాచ్డ్ గా… ఎస్ఆర్ నగర్ SHO పైడి వెంకటరామ ప్రసాదరావును సీటీసీ CARకు బదిలీ చేశారు. వీరితో మరికొందరిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Published 30 Jan 2024