ఎస్ఐ, ఏఎస్ఐ తుది ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో కూడిన ఫైనల్ లిస్టు రిలీజ్ అయింది. మొత్తం 587 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను నియామక బోర్డు ప్రకటించింది. ఇందులో 443 మంది పురుషులు, 153 మంది మహిళలు ఉద్యోగాలకు ఎంపికైనట్లు పోలీసు నియామక బోర్డు ప్రకటించింది. వివరాలను సోమవారం TSLPRB వెబ్ సైట్ ప్రత్యేక లాగిన్ లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. అన్ని కేటగిరీల్లో ఎంపిక చేసిన క్యాండిడేట్స్ కు సంబంధించి కటాఫ్ మార్కులు తెలియజేస్తామని బోర్డు ప్రకటించింది.