
అసలే అటు ఎలక్షన్లు, ఇటు దీపావళి(Diwali) పండుగ. ఒకవైపు సౌండ్ బాక్సుల గోల.. మరోవైపు టపాసుల(Crackers) సందడి. బాణసంచా వల్ల కేవలం సందడే కాదు.. పర్యావరణానికి ఇబ్బందికరమే. అందుకే హైదరాబాద్ నగర పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీపావళి పండుగ వేళ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బాణసంచా కాల్చడంపై ఆంక్షలు విధించడంతోపాటు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. పండుగ ప్రారంభమయ్యే ఈ నెల 12 నుంచి.. 15 వరకు నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలిపారు.
కేవలం రెండు గంటల పాటే
ఎక్కువ సౌండ్ వచ్చే టపాసులను రాత్రి పూట మాత్రమే కాల్చాలని, 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఆదేశాలు ఇచ్చారు. మిగతా సమయాల్లో పరిమితికి మించి సౌండ్స్ వచ్చే బాణసంచా ఎట్టిపరిస్థితుల్లోనూ కాల్చవద్దని చెబుతున్నారు.