రాష్ట్రంలో జరుగుతున్న లోక్ సభ నియోజకవర్గాల పోలింగ్ లో భాగంగా పలు నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిసింది. మధ్యాహ్నం 4 గంటలకు పోలింగ్ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. సాధారణ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతున్నా మావోయిస్టు(Maoist) ప్రభావిత(Effected) ప్రాంతాల్లో(Areas)లో ముందుగా ప్రకటించిన మేరకు పోలింగ్ ముగిసిపోయింది.
ఈ సెగ్మెంట్లలో…
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ముద్రపడ్డ 13 శాసనసభ(Assembly) నియోజకవర్గాల(Constituencies) పరిధిలో నాలుగింటి వరకే పోలింగ్ సమయం కేటాయించింది ఎన్నికల సంఘం. దీంతో చెన్నూర్, సిర్పూర్, ఆసిఫాబాద్, మంథని, బెల్లంపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, పినపాక, భద్రాచలం, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట సెగ్మెంట్ల పరిధిలో మిగతా ప్రాంతాల కన్నా రెండు గంటల ముందుగానే ఓటింగ్ ప్రక్రియ కంప్లీట్ అయింది.