ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత అవగాహన కల్పిస్తున్నా మేం మారేది లేదని(No Change) నిరూపించారు హైదరాబాద్ ఓటర్లు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ నియోజకవర్గాల పోలింగ్ లోనూ జఢత్వాన్ని(Lazyness) చూపించారు. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పోలింగ్… సాయంత్రం ఆరింటికి ముగిసింది.
సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 61.16 శాతం పోలింగ్ నమోదైనట్లు EC అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ లో అత్యల్పంగా 39.17% మాత్రమే ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు.
నియోజకవర్గాల వారీగా పర్సంటేజీ…
భువనగిరి | 72.34 |
జహీరాబాద్ | 71.91 |
మెదక్ | 71.33 |
ఖమ్మం | 70.76 |
నల్గొండ | 70.36 |
ఆదిలాబాద్ | 69.81 |
మహబూబాబాద్ | 68.60 |
మహబూబ్ నగర్ | 68.40 |
నిజామాబాద్ | 67.96 |
కరీంనగర్ | 67.67 |
నాగర్ కర్నూల్ | 66.53 |
వరంగల్ | 64.08 |
పెద్దపల్లి | 63.86 |
చేవెళ్ల | 53.15 |
మల్కాజిగిరి | 46.27 |
సికింద్రాబాద్ | 42.48 |
హైదరాబాద్ | 39.17 |
దశల వారీగా పోలింగ్ సరళి ఇలా…
ఉదయం 9 గంటల వరకు..: 9.51%
ఉదయం 11 గంటల వరకు..: 24.31%
మధ్యాహ్నం ఒంటి గంట వరకు..: 40%
మధ్యాహ్నం మూడింటి వరకు..: 52.32%
సాయంత్రం ఐదింటి వరకు…: 61.16%