పొద్దున 11 గంటల వరకు నిదానంగా సాగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్(Polling) మధ్యాహ్నానికి ఊపందుకుంది. ఎండని సైతం లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. పట్టణాలు, నగరాల్ని మినహాయిస్తే ఈసారీ గ్రామీణ ప్రాంతాల్లోనే భారీస్థాయిలో ఓట్లు పడుతున్నాయి.
పగలు ఒంటి గంట వరకు రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో 40.38% ఓట్లు పోలయినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ఉదయం 9 గంటల వరకు..: 9.51%
ఉదయం 11 గంటల వరకు..: 24.31%
మధ్యాహ్నం ఒంటి గంట వరకు..: 40.38%
నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం…
జహీరాబాద్ | 50.71 |
ఖమ్మం | 50.63 |
ఆదిలాబాద్ | 50.18 |
మహబూబాబాద్ | 48.81 |
నల్గొండ | 48.48 |
మెదక్ | 46.72 |
భువనగిరి | 46.49 |
నాగర్ కర్నూల్ | 45.88 |
మహబూబ్ నగర్ | 45.84 |
నిజామాబాద్ | 45.67 |
కరీంనగర్ | 45.11 |
పెద్దపల్లి | 44.87 |
వరంగల్ | 41.23 |
చేవెళ్ల | 34.56 |
మల్కాజిగిరి | 27.69 |
సికింద్రాబాద్ | 24.91 |
హైదరాబాద్ | 19.37 |