గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎగ్జామ్ ప్రిలిమినరీ కీని TSPSC ప్రకటించింది. దీంతోపాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్, OMR డిజిటల్ ఇమేజెస్ ను వెబ్ సైట్లో ఉంచింది. ఈ కాపీలు జులై 27 సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల నమోదుకు ప్రత్యేక లింక్ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 2,33,506 మంది అటెండ్ అయ్యారని, అయితే పూర్తి సమాచారంతోపాటు డిజిటల్ ఇమేజింగ్ తర్వాత… అటెండ్ అయిన వారి మొత్తం సంఖ్య ఈ మేరకు నిర్ధరణ అయినట్లు TSPSC కార్యదర్శి అనితా రామచంద్రన్ వివరించారు.

ఈ మెయిల్స్, ఇతర పర్సనల్ రెక్వెస్ట్ ల ద్వారా వచ్చే వారిని అభ్యంతరాల నమోదుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యంతరాలు నమోదు చేసే సమయంలోనే అభ్యర్థులు… ఆధారాల కాపీలు జతచేయాలని సూచించారు.