రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఏర్పాట్లపై ఎన్నికల సంఘం(EC) దృష్టి పెడుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి మరో ఇద్దరు IASలను అప్పజెప్పింది. స్టేట్ అడిషనల్ సీఈవోగా డి.ఎస్.లోకేశ్ కుమార్ ను, జాయింట్ సీఈవోగా ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా పనిచేస్తున్న సర్ఫరాజ్ అహ్మద్ ను నియమించింది. IFS అధికారి టి.రవికిరణ్ స్థానంలో సర్ఫరాజ్ బాధ్యతలు చేపడతారు. ఇప్పటికే హైదరాబాద్ లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీసర్స్… రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ అయి అసెంబ్లీ ఎలక్షన్స్ కు సంబంధించిన వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో చేపట్టబోయే విధివిధానాల గురించి వారికి వివరించడమే కాకుండా కలెక్టర్లు, ఎస్పీలకు ట్రెయినింగ్ క్లాసెస్ నిర్వహించారు.
ఎలక్షన్ ఆఫీస్ కు అడిషనల్ గా మరింత మంది ఆఫీసర్స్ కావాలని స్టేట్ ఎలక్షన్ CEO… ఆ సమయంలోనే ఈసీ ముఖ్య కార్యదర్శి రాహుల్ శర్మను కోరారు. ఈ మేరకు అడిషనల్ సీఈవో, జాయింట్ సీఈవో పోస్టులకు ముగ్గురు చొప్పున ఆఫీసర్ల పేర్లతో ప్రభుత్వం లిస్ట్ పంపింది. వాటిని పరిశీలించిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్… లోకేశ్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్ ను ఎంపిక చేసింది. అందులో భాగంగానే తాజాగా ఈ ఇద్దరు IASలను కేటాయిస్తూ ఈసీ ఆర్డర్స్ ఇచ్చింది.