చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు పౌష్ఠికాహారం అందించే అంగన్వాడీల్లో.. ప్రాథమిక విద్యను చేరుస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల(Proposals)పై విస్తృత చర్చ నడుస్తున్నది. ఇది అమలు సాధ్యమేనా అన్న అనుమానాలు ఉద్యోగ సంఘాల్లో కనిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో నడుస్తున్న అంగన్వాడీల్లో ప్రైమరీ విద్య సాధ్యాసాధ్యాల గురించి సంఘాలు ఏమంటున్నాయంటే…
స్కూళ్లుగా పరిగణిస్తారా…
అంగన్వాడీల్ని స్కూళ్లుగానే పరిగణిస్తారా అన్నది ప్రధాన చర్చ. తాజా నిర్ణయంతో 1 నుంచి 5 వరకు నడిచే పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరమేనట. ప్రైవేటు స్కూళ్ల మాదిరిగా నర్సరీ, LKG, UKGని అంగన్వాడీల్లో నడిపినా.. ఒకటో తరగతి నుంచి మాత్రం ప్రాథమిక పాఠశాలల్లోనే కొనసాగించాలంటన్నారు. లేకపోతే రానున్న రోజుల్లో ప్రైమరీ స్కూల్స్ మూతపడతాయని సంఘాలు అంటున్నాయి.
చర్చకు వస్తున్న అంశాలివే…
అంగన్వాడీలు అనేవి స్కూల్ నేచర్ కాదు
థర్డ్ క్లాస్ వరకు షిఫ్ట్ చేస్తే ప్రైమరీ స్కూళ్లు మూతపడతాయి…
4వ తరగతి నుంచి ఎలాగూ సెమీ రెసిడెన్షియల్ కు పంపటం వల్ల ప్రైమరీ స్కూళ్లు ఉండవు…
18,500 ప్రైమరీ స్కూళ్లల్లో 50,000 మంది దాకా టీచర్లున్నారు…
అంగన్వాడీకో టీచర్ ను ఇచ్చినా మిగతా 21 వేల పోస్టులు ప్రశ్నార్థకం…
BLOతోపాటు వివిధ రకాల డ్యూటీల్ని అంగన్వాడీలు చేస్తుంటారు…
ట్రెయిన్డ్ టీచర్స్ కాని అంగన్వాడీల వద్ద టీచర్లు ఎలా పనిచేయగలరు…
ఛైల్డ్ సైకాలజీపై అనుభవం లేకపోవడం అంగన్వాడీలకు బోధన కష్టతరం…
అంగన్వాడీల్లో ఆట స్థలాలెక్కడ… ప్రైమరీ స్కూళ్ల మాదిరిగా గదులుంటాయా…
క్వాలిఫికేషన్, శాలరీ పరంగా ఉన్నతస్థాయిలో ఉండే టీచర్లను అంగన్వాడీలో ఎలా సర్దుబాటు చేస్తారు…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో నడిచే అంగన్వాడీల్లో ఏ ప్రాతిపదికన టీచర్లను నియమిస్తారు…
ప్రభుత్వ నిర్ణయంతో ప్రైమరీ స్కూళ్లు శాశ్వతంగా మూతపడే ప్రమాదం…
విద్యార్థి దశకు కీలకమైన 1 నుంచి 3 తరగతులకు ఒకే టీచర్ వల్ల బోధన కష్టసాధ్యం…
చివరకు పిల్లలంతా ప్రైవేటు బాట పట్టడమే… ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల్లో నడుస్తున్న ప్రధాన చర్చ ఇది.