జూనియర్ లెక్చరర్ల ఎగ్జామ్స్ కు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని TSPSC అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఈ నెల 23(రేపటి) నుంచి ఈ ‘కీ’ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అభ్యంతరాలను ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు స్వీకరిస్తారు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల లోపు అభ్యంతరాల్ని నమోదు చేయాల్సి ఉంటుంది. బోర్డు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in లో ప్రాథమిక ‘కీ’ని అందుబాటులో ఉంచనుండగా.. అభ్యంతరాల్ని సైతం అందులోనే తెలియజేయాల్సి ఉంటుంది. ఈ-మెయిల్స్, ఇతర పర్సనల్ మార్గాల ద్వారా వచ్చే అభ్యంతరాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని TSPSC అధికారులు స్పష్టం చేశారు. ఆ అభ్యంతరాల్ని బోర్డు వెబ్ సైట్ లో ఇంగ్లిష్ లోనే వివరించాలని తెలిపారు.
నాలుగు పరీక్షల ‘కీ’ మాత్రమే
కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్(CBRT) పద్ధతిలో జూనియర్ లెక్చరర్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో జరిగిన ఇంగ్లిష్, బోటనీ, ఎకనామిక్స్, మాథమాటిక్స్ పేపర్లకు సంబంధించిన ప్రైమరీ ‘కీ’ని తొలుత అందుబాటులోకి తెస్తున్నట్లు TSPSC ప్రకటించింది.