అమ్మవారి కళ్యాణం కోసం ఆలయాని(Temple)కి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రొటోకాల్ విషయంలో ఇబ్బందిపడ్డారు. సికింద్రాబాద్ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి మంత్రి, GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ హాజరయ్యారు. ఆయనకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. దీంతో మంత్రి అలకబూని ప్రొటోకాల్ పాటించడం లేదంటూ కొద్దిసేపు బయటే కూర్చున్నారు.
కలెక్టర్ పై…
ప్రొటోకాల్ పాటించడం లేదంటూ కలెక్టర్ అనుదీప్ పై మంత్రి అసహనం చెందారు. కలెక్టర్ వచ్చి బతిమిలాడాల్సి(Request) వచ్చింది. అయినా కొద్దిసేపు మంత్రి, మేయర్ ఆలయం బయటే గద్దెపై కూర్చున్నారు. కాసేపటికి సమస్య సద్దుమణిగిన తర్వాత.. తానేం అలగలేదని మంత్రి చెప్పారు.
అమ్మవారి ఆలయంలో అలుగుతామా అని మాట్లాడిన ఆయన.. తోపులాటలో మహిళా రిపోర్టర్ కు ఎదురైన చేదు అనుభవానికి ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామన్న రవాణాశాఖ పొన్నం ప్రభాకర్… అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. CS శాంతికుమారి అమ్మవారిని దర్శించుకున్నారు.