
రైలు ప్రయాణమంటే చాలు.. గంటలకు గంటలు పట్టే జర్నీలో ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం. దొరికిందే మహా ప్రసాదమని ఆకలి తీర్చుకుంటాం. ఇక జనరల్ బోగీల్లోనైతే ఎక్స్ పైరీ డేట్(expiry date) లేని బయటి పదార్థాలే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక నుంచి ఆ తిప్పలు తప్పేలా రైల్వే శాఖ.. ‘ఎకానమీ మీల్స్’ పేరిట తక్కువ ధరకే క్వాలిటీ ఫుడ్ ను అందిస్తోంది. ప్యాసింజర్స్ (passengers) కోసం రూ.20కే భోజనం(meals) అందించేందుకు తొలి దశలో 4 స్టేషన్లను సెలెక్ట్ చేసింది. హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్ స్టేషన్ లలో ఇక నుంచి రెండు రకాల భోజనం అందుబాటులో ఉంచుతోంది. రైళ్లను నమ్ముకున్న వారికి నాణ్యమైన, సరసమైన ధరలకు భోజనం అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రోగ్రాంను రైల్వే శాఖ స్టార్ట్ చేసింది.
‘ఎకానమీ మీల్స్’ లో భాగంగా జనరల్ కోచ్ లలో ట్రావెల్ చేసేవారికి రెండు రకాలుగా మీల్స్ అందిస్తారు. మొదటిదైన ఎకానమీ రకానికి రూ.20, రెండో రకం కాంబో భోజనానికి రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. రైల్వేస్టేషన్లలోని ఇండియన్ రైల్వే టూరిజం, క్యాటరింగ్ సర్వీస్(IRCTC) కిచెన్ కౌంటర్లు, జన్ ఆహార్ సర్వీస్ కౌంటర్ల ద్వారా భోజనం దొరుకుతుంది. జనరల్ కోచ్ ల సమీపంలోని ప్లాట్ ఫాంలపై ఈ మీల్స్ అమ్మేలా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. అంతేకాదండోయ్.. మెనూలో సౌత్ ఇండియన్ ఆహార పదార్థాలు ఉంటాయని తెలిపింది.
It’s Very helpful for the passengers…
Good move..