ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ముందస్తుగా ఏర్పాటు చేసిన నైట్ పెట్రోలింగ్ సిబ్బంది ఈ విషయాన్ని సకాలంలో గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె మార్గంలో రైల్వే ట్రాక్ కు ఆనుకుని వరద(Flood) ప్రవహించింది.
దీంతో ట్రాక్ కిందున్న కంకర మొత్తం కొట్టుకుపోయి కేవలం ట్రాక్ మాత్రమే మిగిలింది. దీంతో విజయవాడ-వరంగల్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ఆ రైళ్లను దారి మళ్లించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.