రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇంకా వర్షాలు తగ్గడం లేదు. గత 24 గంటల వ్యవధిలో సిద్దిపేట జిల్లా కోహెడ(Koheda) మండలంలోని మూడు గ్రామాల్లో పెద్ద వర్షం కురిసింది. కోహెడ మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 22.3 సెంటీమీటర్లు, అదే మండలం సముద్రాలలో 21.5 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
నిన్న పొద్దున 8:30 నుంచి ఈరోజు ఉదయం వరకు నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్ లో 19.8, సిద్దిపేట జిల్లా శనిగరంలో 17.2, నిజామాబాద్ జిల్లా తొండకూర్లో 16.2, సిద్దిపేట జిల్లా నంగ్నూర్లో 14, పెద్దపల్లి జిల్లా అక్కెనపల్లిలో 12.7, నిజామాబాద్ జిల్లా మాచెర్లలో 12.5, ఆలూరులో 11.7 సెంటీమీటర్ల మేర వర్షపాతం రికార్డయింది.