రాగల రెండు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలుండగా, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. ఈ మేరకు భారీ వర్షాలుండే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) ఉంటాయి. హైదరాబాద్, మహబూబ్ననగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది.