భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం నగదు అందించనుంది. రాష్ట్రంలో భూమి లేని సుమారు 15 లక్షల కుటుంబాలకు రూ.12 వేల చొప్పున అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శాసనసభ(Assembly) లాబీల్లో పలు అంశాలు ప్రస్తావించిన ఆయన.. రైతు భరోసా కింద ప్రతి పేద కౌలు కుటుంబానికి రూ.12 వేలు అందించేందుకు గాను రూ.1,000 కోట్లు విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు గుర్తు చేశారు. రైతు భరోసా, ఆసరా పింఛన్ల(Pension)ను సంక్రాంతి నుంచి అందజేయబోతున్నారు.