రైతుబంధుగా ఉన్న పథకాన్ని రైతు భరోసాగా మార్చి పంట పెట్టుబడి సాయం అందించే కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 14న సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అమలు చేసే ఆలోచనలో కేబినెట్ సబ్ కమిటీ ఉంది. దీనిపై భేటీ అయిన భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ రేపు CMను కలవబోతోంది. అయితే సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వాలని భావించగా.. ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో దీనికి తుదిరూపునిచ్చే అవకాశముంది. శాటిలైట్(Satellite) మ్యాపింగ్(Mapping) ద్వారా సాగు భూముల్ని గుర్తించనుండగా.. ఈ స్కీమ్ కోసం ప్రత్యేకంగా అప్లికేషన్లు తీసుకోనున్నారు. ఈ నెల 5 నుంచి 7 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగే అవకాశాలున్నాయి. భూముల గుర్తింపునకు అధికారులు సర్వే సైతం నిర్వహించే ఛాన్సెస్ ఉన్నాయి.
ఎకరానికి రూ.7,500 చొప్పున ఏడాదికి రెండు విడతలుగా ఇవ్వాలని గతంలోనే నిర్ణయించగా.. ఆ లోపాల్ని సవరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ కం టాక్స్ చెల్లించే వారికి ఇవ్వకుండా, ఎన్ని ఎకరాలనే దానిపై సీలింగ్ విధించడం వంటి వాటిపై కొత్తగా విధివిధానాలపై దృష్టిపెట్టారు. సుమారు 68 లక్షల మందికి లబ్ధి కలగనుండగా, 10 ఎకరాలకు మించి ఉన్నవారు 92 వేల మంది ఉన్నారు. రాళ్లు, గుట్టలు, ఫీల్డ్ మీద లేని వాళ్లను తీసివేస్తే లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గనుంది.