ఫాంహౌజ్ లో జరిగిన పార్టీపై ఎక్సైజ్ అధికారుల దాడి కేసులో KTR బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు. కేసులో తనను అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై లంచ్ విరామం తర్వాత విచారణ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి స్పష్టం చేశారు.
జన్వాడ(Janwada) ఫాంహౌజ్ ఘటనపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మోకిల పోలీసులు.. రాజ్ పాకాల పరారీలో ఉన్నాడని ప్రకటించారు. ఈ పార్టీలో విజయ్ మద్దూరికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధరించగా.. A1గా రాజ్ పాకాల, A2గా విజయ్ మద్దూరి పేర్లు చేర్చారు. నిన్నట్నుంచి ఓరియన్ విల్లాస్ లో విస్తృతంగా తనిఖీలు చేసిన అధికారులు.. KTR బావమరిది పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. దీంతో తన అరెస్టు తప్పదని భావించిన ఆయన.. హైకోర్టులో పిటిషన్ వేశారు.