అన్ని పథకాలకు కీలక ఆధారంగా(Key Source) నిలుస్తున్న రేషన్ కార్డు.. రుణమాఫీలోనూ ముఖ్య పాత్ర పోషించబోతున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ లో ఆ విషయాన్ని పొందుపరిచారు. ఈ లెక్కన అర్హులై ఉండి రేషన్ కార్డు లేకుంటే రుణమాఫీ కష్టమేనని దీన్ని బట్టి అర్థమవుతున్నది.
ఎలా అంటే…
రుణమాఫీ పథకం కింద లబ్ధిదారులైన రైతు కుటుంబాన్ని తొలుత పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాంకులు సమర్పించిన రైతుల రుణ ఖాతాలోని ఆధార్(Aadhar)ను పాస్ బుక్ డేటా బేస్ లో ఉన్న ఆధార్ తో మ్యాప్ చేయాలి. దీనికితోడు PDS డేటాబేస్ లో ఉన్న ఆధార్ తోనూ డేటాను సరిపోల్చుకోవాల్సి ఉంటుంది.
అంటే పౌరసరఫరాల శాఖ నిర్వహించే ఆహార భద్రత కార్డు(రేషన్ కార్డు-PDS) డేటాబేస్ ప్రామాణికత ఆధారంగా పరిశీలన చేస్తారు. కుటుంబానికి చెందిన యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు ఎంతమంది అనే వాటిపై రుణమాఫీ పరిశీలన కొనసాగుతుంది.