BC, SC, ST, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9 తరగతుల్లో ప్రవేశాల(Admissions)కు రేపు పరీక్ష జరగనుంది. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం 1,67,708 అప్లికేషన్లు వచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొత్తం 643 గురుకులాల్లో(Gurukulas) 51,968 సీట్లు అందుబాటులో ఉండగా, కేవలం ఐదో తరగతి అడ్మిషన్ల కోసమే పెద్దయెత్తున 88,824 దరఖాస్తులు వచ్చాయి. ఆరో తరగతి కోసం 32,672 అప్లికేషన్లు రాగా, రేపు జరిగే పరీక్షకు అందరూ హాజరు కావాలని కోరారు.