ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈనెల(జులై) 14 నుంచి కార్డులు అందజేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్తగా 5 లక్షల కార్డులు ఇస్తుండగా, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పంపిణీ ప్రారంభిస్తారు. ఆరోజు జరిగే సభ ద్వారా CM రేవంత్ చేతుల మీదుగా లబ్ధిదారులకు కార్డులు అందిస్తారు. 95 లక్షల కుటుంబాల్లోని 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇచ్చేందుకు రూ.13 వేల కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు. https://justpostnews.com