ముందుగా ప్రకటించిన మేరకు ఈనెల 9న కాకుండా రేపు ప్రమాణస్వీకారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. రేవంత్ తో ఆయన నివాసంలో సమావేశమైన డీజీపీ అంజనీకుమార్.. నూతనంగా ఎన్నికైన MLAలు అందరికీ 2+2 గన్ మెన్ కేటాయించాలని SPలను ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఈ విషయాన్ని ఆయన DGPకి తెలియజేశారు.