ఎలక్షన్లు రానున్న దృష్ట్యా ఓటర్ల నమోదుపై ఎలక్షన్ కమిషన్(EC) దృష్టి పెట్టింది. ఈ మేరకు పలు రాజకీయ పార్టీలతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సమావేశమయ్యారు. ఈ నెల 26, 27 తేదీలతో పాటు సెప్టెంబరు 2, 3 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ఓటు హక్కు నమోదు కోసం ఇప్పటివరకు 17,28,778 మంది అప్లయ్ చేసుకున్నారని 15,05,333 మంది రిక్వెస్ట్ లను ఆమోదించామని వికాస్ రాజ్ తెలిపారు. ఈ నెల 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు.