ఈ రోజు జరిగే గ్రూప్-4 ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్-1.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. మొత్తం 8,180 పోస్టులకు 9.51 లక్షల మంది హాజరు కానుండగా.. టీఎస్పీఎస్సీ చరిత్రలో ఈ స్థాయిలో అప్లికేషన్లు రావడం ఇది రెండోసారి. 700 వీఆర్వో ఉద్యోగాలకు 2018లో 10.58 లక్షల మంది అప్లై చేయగా, 7.9 లక్షల మంది ఎగ్జామ్ కు అటెండ్ అయ్యారు.

నిబంధనలివి…
పరీక్ష స్టార్ట్ కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసేస్తారు.
పేపర్-1: ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఉండటంతో ఉదయం 8 గంటల నుంచే లోపలికి అనుమతి
పేపర్-2: మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఒంటి గంట నుంచే ఎగ్జామ్ సెంటర్ కి అనుమతి.
ఈసారి ఫింగర్ ప్రింట్ తప్పనిసరి.
నామినల్ రోల్ లో సంతకం చేసిన తర్వాత ఎడమ చేతి బొటన వేలిముద్ర కోసం ప్రత్యేక స్థలం
ప్రతి సెషన్ పూర్తయ్యాక OMR షీట్ ఇన్విజిలేటర్ కు ఇచ్చి వేలిముద్ర వేయాలి.
OMR షీట్ లో బ్లూ/బ్లాక్ పెన్ మాత్రమే వాడాలి.
చెప్పులు మాత్రమే వేసుకోవాలి… షూ వాడొద్దు.