నిండు వానాకాలంలో చినుకు జాడ కనపడట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా 11% లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు రెండు వారాల ముందే వచ్చినా వర్షాలు మాత్రం లేవు. విత్తులు వేస్తే మొలకలు వచ్చినా గట్టి వాన లేక ఎదుగుదల కనపడట్లేదు. రోహిణి కార్తెలో భారీ వర్షాలు, వానలు పడే సీజన్లో ఎండలు కొడుతూ రైతుల్ని ముంచేస్తున్నాయి. ఉత్తరాదిలో వెంటవెంటనే ఏర్పడుతున్న అల్పపీడనాలు అక్కడే స్థిరమవడంతో.. దిగువ ప్రాంతాల్లో వేడి ఉంటోంది. ఇక మే నెలలో భారీ ఎండలు ఉండాల్సింది. అందుకు భిన్నంగా మొత్తం వానలే కురిశాయి. మే లో భూమి వేడి తగ్గి అల్పపీడనాలు రాకుండా చేసింది. భూమి వేడి సముద్రం కన్నా ఎక్కువున్నప్పుడు అల్పపీడనం ఏర్పడుతుంది. కానీ పుడమి వేడి తగ్గడంతో ఇప్పుడు వర్షాల్లేకుండా పోయాయి. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com