ఈరోజు సైతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) తెలిపింది. నిన్న జారీ చేసిన రెడ్ అలర్ట్ ఈరోజు సైతం నాలుగు జిల్లాలకు కంటిన్యూ అవుతున్నది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ(Extremely Heavy) వర్షాలు పడే అవకాశాలున్నాయి. జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా సహా 12 జిల్లాల్లో భారీ వర్షాలకు గాను ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నది.
నిన్న పొద్దున 8:30 నుంచి ఈరోజు ఉదయం వరకు కామారెడ్డిలో అత్యధికంగా 25.4 సెంటీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లిలో 22.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 11 ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డయింది.