
నాలుగు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. 5 జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్(red alert)’ ప్రకటించింది. అటు ఉత్తర తెలంగాణలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోనూ నిరంతరాయంగా వాన పడుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న రెయిన్స్ తో సింగరేణి ఉపరితల గని-2, గని-3లో కోల్ ప్రొడక్షన్ నిలిచిపోయింది. బొగ్గు తీసేందుకు ఇబ్బంది కలగడంతో వెహికిల్స్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
వాయువ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావం వల్ల వచ్చే 48 గంటల్లో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉండటంతో తెలంగాణలో వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రేపు, ఎల్లుండి సైతం భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.