అత్యంత భారీ వర్షాల ప్రమాదమున్నందున 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్(Adilabad), కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉండగా.. ఇప్పుడు మరింత పెరిగింది. ఆయా జిల్లాల్లో గత 36 గంటల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల దాకా వర్షపాతాలు రికార్డయ్యాయి. అతి కొన్ని గంటల్లో అత్యంత భారీ వర్షాలు ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ.. రెడ్ అలర్ట్ ప్రకటించింది. 20.4 సెం.మీ. మించితే అత్యంత భారీ వర్షాలని అంటారు. ట్రాఫిక్ నిలిచిపోవడం, రోడ్లపై చెట్లు, స్తంభాలు పడటం, డ్రైనేజీ అస్తవ్యస్థంతో రెడ్ అలర్ట్(Red Alert) జారీ అవుతుంటుంది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com