ఇప్పటికే బెంబేలెత్తిస్తున్న వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) ప్రకటించింది. ఈరోజు నుంచి ఎల్లుండి వరకు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ఈ నాలుగు జిల్లాల్లో అత్యంత భారీ(Extremely Heavy) వర్షాలు ఉంటాయని తెలిపింది. ఇక మరో 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయి. ఆదిలాబాద్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమురం భీమ్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ఇచ్చింది. https://justpostnews.com