శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(SRSP)కు వరద నీటి రాక బాగా తగ్గింది. నిన్నటివరకు లక్షన్నర క్యూసెక్కులు రాగా ఈరోజు పొద్దున్నుంచి క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతానికి ఇన్ ఫ్లో 8,100 క్యూసెక్కులుండగా, అంతే మొత్తాన్ని వదులుతున్నారు. గరిష్ఠ నీటిమట్టం 90 TMCలకు గాను ప్రస్తుతం 85 TMCలు నిల్వ చేస్తున్నారు.