ACB కేసు విషయంలో ఇప్పటికే హైకోర్టు నుంచి షాక్ ఎదుర్కొన్న KTR.. ఈరోజు మాత్రం అదే న్యాయస్థానం నుంచి కాస్త ఉపశమనం(Relief) పొందారు. ACB విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలంటూ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ సాగింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. న్యాయవాది(Lawyer)ని అనుమతిస్తూ తీర్పునిచ్చారు. KTRతోపాటు న్యాయవాది ACB విచారణకు రావొచ్చంటూ ఈ విషయంలో కొన్ని షరతులు విధించింది. అయితే ఆ గదిలోకి లాయర్ వెళ్లకూడదని, అక్కడ KTRతోపాటు అధికారులు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. విచారణ గది పక్కనే లైబ్రరీ రూంలో న్యాయవాది కూర్చోవచ్చని, ఈనెల 9న అధికారుల ముందుకు వెళ్లాలని ఆదేశాల్లో తెలిపింది. స్టేట్మెంట్ రికార్డులో ఏవైనా అనుమానాలుంటే మళ్లీ కోర్టుకు రావచ్చని చెప్పిన న్యాయస్థానం.. అక్కడి పరిణామాలపై ఆడియో, వీడియో రికార్డింగ్ కు అంగీకరించలేదు.