దట్టమైన అటవీప్రాంతం… ఒకచోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు… మారుమూల ప్రాంతంలో ఇన్ని కష్టాలు ఎలా ఉంటాయో వాటిని అనుభవిస్తున్న వారికే ఎరుక. కానీ అలాంటి ప్రాంతమే విద్యాసుగంధాలు విరజమ్మింది. కార్పొరేట్ సంస్కృతి ఉండే పెద్ద పెద్ద జిల్లాలను తలదన్ని ఇంటర్ ఫలితాల్లో (Inter Results) అగ్రస్థానం(Top Place)లో నిలబడింది.
హైదరాబాద్ లో భాగమైన రంగారెడ్డి జిల్లా ఫస్టియల్ రిజల్ట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిస్తే… మేడ్చల్(Medchal) రెండో స్థానాన్ని దక్కించుకుంది. కానీ సెకండియర్ ఫలితాల్లో మాత్రం హైదరాబాద్ సహా చుట్టుపక్కల గల ఏ జిల్లా కూడా టాపర్ గా నిలవలేదు. ఎక్కడో మారుమూల ప్రాంతమైన(Remote Area) ములుగు జిల్లా ఆ రికార్డును సొంతం చేసుకుంది. 82.95 శాతంతో ములుగు రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మేడ్చల్ జిల్లా సెకండియర్‌లోనూ సెకండ్ ప్లేస్ దక్కించుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 60.01%, ద్వితీయ సంవత్సరానికి 64.19% మంది పాస్ అయ్యారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారీ బాలికలే అగ్రస్థానంలో నిలిచారు. ‘ఆన్ లైన్ మెమొరాండం ఆఫ్ మార్క్స్’ కు సంబంధించి tsbie.cgg.gov.in వెబ్ సైట్లో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కలర్ ప్రింట్లు తీసుకోవచ్చని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. రిజల్ట్స్ ను http://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in లో చూసుకోవచ్చని తెలిపింది.