పదో తరగతి ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. వారి పాస్ పర్సంటేజ్ 93.23 శాతంగా ఉన్నట్లు విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రకటించారు. బాలుర ఉత్తీర్ణత 89.42గా ఉంది. ఇంటర్ మాదిరిగానే టెన్త్ లోనూ మారుమూల జిల్లానే నంబర్ వన్ గా నిలిచింది. 99.09 శాతంతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానం(First Place) ఆక్రమించింది. ఇంటర్మీడియట్లో ములుగు జిల్లా టాప్ ప్లేస్ లో ఉన్న సంగతి తెలిసిందే.
అందులో సున్నా…
6 స్కూళ్లలో సున్నా శాతం రాగా.. అవన్నీ ప్రైవేటు పాఠశాలలే(Schools) కావడం విశేషంగా నిలిచింది. 3,927 స్కూళ్లలో 100% రిజల్ట్స్ సాధించాయి. 65.10%తో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మొత్తంగా టెన్త్ లో 91.31% మంది పాసయ్యారు. 98.65%తో సిద్దిపేట రెండో స్థానంలో, 98.27%తో సిరిసిల్ల జిల్లా థర్డ్ ప్లేస్ దక్కించుకున్నాయి.
8 వేలకు పైగా…
8,883 మందికి 10/10 GPA రాగా.. 98.71 శాతంతో గురుకుల పాఠశాలలు తొలి స్థానంలో ఉన్నాయి. జూన్ 3 నుంచి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుండగా.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఈ రోజు నుంచి 15 రోజుల పాటు అవకాశం కల్పించారు.