పార్లమెంటు(Parliament) ఎన్నికల్లో కమలం(Saffron) పార్టీని గెలిపించేందుకు గులాబీ పార్టీ అభ్యర్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. BJP గెలిచిన 8 ఎంపీ స్థానాల్లో BRS డిపాజిట్లు కోల్పోవడమే ఇందుకు ఎగ్జాంపుల్ అని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత సమావేశం నిర్వహించిన ఆయన.. ముఖ్యమంత్రిగా, PCC అధ్యక్షుడిగా పార్టీ అభ్యర్థుల గెలుపోటముల బాధ్యత పూర్తిగా తనదేనన్నారు.
కేసీఆర్ సపోర్ట్ తోనే…
కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు, కుతంత్రాలు ఉంటాయని.. BJPకి పనిచేసేలా BRS లీడర్లకు స్వయంగా ఆయనే దిశానిర్దేశం చేశారని రేవంత్ విమర్శించారు. ప్రధానిని ప్రజలు విశ్వసించనందున వెంటనే మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. మూడోసారి PMగా బాధ్యతలు చేపట్టకూడదన్నారు.