పుష్ప-2 ప్రీమియర్ షో తొక్కిసలాటపై CM రేవంత్.. అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఎవ్వర్నీ వదిలిపెట్టేది లేదంటూ ఆయన భావోద్వేగంగా ఇచ్చిన స్పీచ్ ఆయన మాటల్లోనే…
అభిమానుల్ని బౌన్సర్లు తోసివేయడంతో పెద్ద తొక్కిసలాట జరిగింది. ‘ఆ తల్లి తన కొడుకును చేయి పట్టుకుని లోపలికి వచ్చిన వీడియో నేను చూసిన అధ్యక్షా.. ఈ తొక్కిసలాట గురించి థియేటర్లో కూర్చున్న హీరోకు సమాచారమిద్దామంటే పోలీసులు వెళ్లకుండా థియేటర్ వాళ్లు బ్లాక్ చేశారు.. చివరకు ACP వార్నింగ్ ఇచ్చాక లోపలికి వెళ్లి ఇద్దరు చనిపోయారన్న విషయాన్ని అల్లు అర్జున్ కు క్లియర్ గా చెప్పారు.. మీరు ఇక్కడ కూర్చుంటే ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం.. దయచేసి మీరు వెళ్లిపోండి అంటే నేను సినిమా అయిపోయేవరకు ఇట్లే కూర్చుంటానన్న విషయం పోలీసులతో చెప్పినట్లు సిటీ కమిషనర్ నాకు చెప్పారు.. ఇద్దరు చనిపోయారని చెప్పి హీరోను బలవంతంగా బండి ఎక్కిస్తే కూడా రాత్రి 12 గంటలకు మళ్లీ రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులూపుతూ రోడ్ షో చేసుకుంటూ హీరో వెళ్లిపోయారు అధ్యక్షా..’ అని ఆరోజు ఘటనల్ని వివరించారు.
నెలకు రూ.30 వేల జీతానికి పనిచేసే తండ్రి.. తన కొడుకు ఆయన అభిమాని అని రూ.3,000కు ఒక టికెట్ పెట్టి మొత్తంగా రూ.12 వేలతో నాలుగు టికెట్లు తీసుకుని థియేటర్ కు వెళ్లి చనిపోతే.. చనిపోయిన కుటుంబాన్ని, హాస్పిటల్లో ఉన్న బాలుణ్ని పరామర్శించడానికి వెళ్లలేదు.. చనిపోయిన పదకొండో రోజు వరకు హీరో గానీ, ప్రొడ్యూసర్ గానీ ఎవ్వరూ పరామర్శించడానికి పోలేదు.. ఇది ఏ రకమైన మానవత్వం.. అలా మానవత్వం లేని వారిని పోలీసులు విధినిర్వహణలో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే.. ఒకాయన ట్విటర్లో పెడతాడు అడ్డగోలుగా పదేండ్లు మంత్రి జేసి.. ఉద్యమంలో షూటింగ్ లు జరగొద్దని దాడులు చేసినోళ్లు.. ఈ హీరో భగవత్ స్వరూపుడు, అతణ్ని పోలీసులు ముట్టుకుంటరా, అసలీ రాష్ట్రం ఏమైపోతుంది, రాష్ట్రం ఉంటదా.. చావుకు కారణమైన వారిని పిలిస్తే కూడా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని నీచమైన భాష వాడిండ్రు అధ్యక్షా.. చనిపోయిన తల్లిని, కోమాలో ఉన్న బాలుణ్ని చూసేందుకు సినీ ప్రముఖులు రాలేదు.. కానీ హీరోను పరామర్శించిండ్రు.. ఆయనకు కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, కిడ్నీలు దెబ్బతిన్నయా.. సినీ ఇండస్ట్రీ పెద్దలు ఏమాలోచిస్తుండ్రో అర్థం కావడం లేదు..’ అంటూ రేవంత్ భావోద్వేగంగా మాట్లాడారు.