జంట జలాశయాల పరిధిలో అక్రమంగా నిర్మించారంటూ ఆరోపణలున్న జన్వాడ ఫాంహౌజ్ ను అధికారులు పరిశీలించారు. రెవెన్యూ, నీటిపారుదల(Irrigation) శాఖల అధికారులు పరిసర ప్రాంతాన్ని పరిశీలన చేపట్టారు. ఫాంహౌజ్ వద్ద ఆక్రమణకు గురైనట్లుగా భావిస్తున్న ఫిరంగి నాలాను తరచి చూశారు. ఫుల్ ట్యాంక్ లెవెల్(FTL) ఎంత.. బఫర్ జోన్ ఏ మేరకు ఉందన్న దానిపై నిఘా పెట్టారు. ఇది తనది కాదంటూ ఇప్పటికే KTR చెప్పిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఇది వివాదాస్పదం కావడంతో ఈ ఫాంహౌజ్ ను ఎప్పుడైనా కూల్చివేయచ్చన్న చర్చ జరుగుతున్నది. ఓనర్ గా చెబుతున్న ప్రదీప్ రెడ్డి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయిస్తే.. అక్కణ్నుంచి ఎలాంటి రిలీఫ్ దక్కలేదు. దీంతో శంకర్ పల్లి తహసీల్దార్ ఆదేశాలతో స్థానిక అధికారులు జన్వాడ ఫాంహౌజ్ పరిశీలనకు దిగారు.