ప్రభుత్వంలో విలీన బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ RTC రేపు బంద్ కు పిలుపునిచ్చింది. పొద్దున 6 గంటల నుంచి 8 గంటల వరకు రెండు గంటల పాటు బంద్ నిర్వహించాలని RTC మజ్దూర్ యూనియన్ నిర్ణయించింది. ఈ రెండు గంటల పాటు బస్సులు బయటకు రావని ఆ సంఘం లీడర్లు తెలియజేశారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. RTC బిల్లును గవర్నర్ ఆమోదించాలంటూ అటు TMU నిరసన వ్యక్తం చేయనుంది. పొద్దున 10 గంటలకు కార్మికులు నెక్లెస్ రోడ్డుకు రావాలంటూ అందరికీ సమాచారం పంపించింది.
రాజ్ భవన్ వద్ద నిరసన చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఉదయం 11 గంటలకు అందరూ రాజ్ భవన్ వద్దకు చేరుకోవాలని ఇప్పటికే ఆయా సంఘాల లీడర్లు పిలుపునిచ్చారు.