
తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రానికి TSRTC… ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడపనుంది. జులై 3 గురుపౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు.. ఈ బస్సు అందుబాటులో ఉంటుంది. జులై 2న ఉదయం 6 గంటలకు MGBS నుంచి బయల్దేరి, కాణిపాకం విఘ్నేశ్వరుడి దర్శనానంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకున్నాక మధ్యాహ్నం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్తుంది. గోల్డెన్ టెంపుల్ సందర్శన తర్వాత బయల్దేరి మరుసటి రోజు జులై 4న ఉదయం పదింటికి బస్సు హైదరాబాద్ వస్తుందని RTC అధికారులు తెలిపారు. ఈ టూర్ టికెట్ ఛార్జి ఒక్కొక్కరికి రూ.2600గా ఉంది. సంస్థ వెబ్ సైట్ www.tsrtconline.inతోపాటు MGBS, JBS, దిల్ సుఖ్ నగర్ సహా RTC రిజర్వేషన్ కౌంటర్లలో ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం 9959226257,9959224911 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
