యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం… భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. ఈరోజు తెల్లవారు నుంచే స్వామి వారి దర్శనం కోసం క్యూ కట్టారు. వేలాది సంఖ్యలో తరలిరావడంతో యాదాద్రి కొండ భక్తజనసంద్రంగా మారింది. ఆదివారం కావడంతో హైదరాబాద్ తోపాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దైవదర్శనానికి విచ్చేశారు. పొద్దున్నుంటి ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట పడుతోంది.
లడ్డూ ప్రసాదం కౌంటర్లు సైతం రద్దీగా మారాయి. అటు కొండ కింద గల పుష్కరిణి, కళ్యాణకట్ట, వాహనాల పార్కింగ్ వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది.