రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి(Guest) అధ్యాపకుల(Lecturers) వేతనాల పెంపుపై సర్కారు దృష్టిపెట్టింది. ఉద్యోగ భద్రత, గౌరవ వేతనాల పెంపుపై 1,654 మందికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.
మాజీ MLA కటకం మృత్యుంజయం ఆధ్వర్యంలో గెస్ట్ లెక్చరర్ల సంఘం మంత్రిని కలిసి సమస్యలు తెలిపింది. ప్రస్తుతమున్న రూ.28 వేలను రూ.42 వేలకు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసింది. వీటిపై దృష్టిసారించాలంటూ విద్యాశాఖ ముఖ్య(Principal) కార్యదర్శి(Secretary) బుర్రా వెంకటేశంను మంత్రి ఆదేశించారు.
ప్రతిపాదిత ఫైల్ సిద్ధమయ్యాక CM రేవంత్ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెగ్యులర్ నియామకాలు జరుగుతున్నందున ఆ తర్వాత గెస్ట్ లెక్చరర్లను తొలగించకుండా సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించే అంశాన్ని పరిశీలిస్తామని శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు.