ఇంటింటికి నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే అన్ని జిల్లాల్లో తుది దశ(Final Stage)కు చేరుకుంది. రాష్ట్ర రాజధాని(Capital) మినహా మిగతా అన్ని జిల్లాల్లో వేగంగా సర్వే పూర్తవుతున్నట్లు అధికారులు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 87 శాతం సర్వే పూర్తయింది. జనగామ, ములుగు జిల్లాల్లో 100 శాతం, మరో రెండు జిల్లాలైన మెదక్, నల్గొండలో 99.9 శాతం చొప్పున సర్వే కంప్లీట్ అయింది.
జగిత్యాల, యాదాద్రి భువనగిరి, గద్వాల జిల్లాల్లో 99 శాతం, కామారెడ్డి జిల్లాలో 98.5.. సిరిసిల్ల, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 98 శాతం సర్వే పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో నిదానంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ లెక్కన అన్ని జిల్లాల్లో కలిపి ఇప్పటివరకు కోటి కుటుంబాల వివరాలు సేకరించగలిగారు. ఈ కులగణన ఆధారంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలనేది సర్కారు సంకల్పం.