RTC సిబ్బంది బిల్లుకు సంబంధించి గవర్నర్ భుజాలపై గన్ను పెట్టి బద్నాం చేస్తున్నారని BJP జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ విలీనాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన.. ‘ఆగమేఘాలపై బిల్లును పంపి సంతకం చేయమంటే ఎలా.. బిల్లులో ఏమైనా లోపాలు ఉన్నాయా..? న్యాయపరమైన ఇబ్బందులున్నాయా..? కార్మికులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే ఏం చేయాలి..? వంటి విషయాలను పరిశీలించే టైమ్ ఇవ్వకుండానే రబ్బర్ స్టాంపులా సంతకం పెట్టమంటే ఎలా..? అని ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్లలో కేంద్రం NDRF కింద రూ.3 వేల కోట్లు ఇస్తే అందులో సగం కూడా ఖర్చు చేయలేదని ఫైర్ అయ్యారు. ఆ నిధులతో ఎంతమంది రైతులకు సాయం చేశారన్నదానిపై CMకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.
ఫసల్ బీమా స్కీమ్ పై అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్స్ కు స్పందించిన సంజయ్.. ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించిన డబ్బుల కంటే రైతులకు ఇచ్చింది తక్కువన్నారు. రుణమాఫీ అనేది ఎన్నికల స్టంట్ అన్న సంజయ్.. నాలుగేళ్లుగా దాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.